Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్... వైసీపీ ఎంపీ కుమారుడిని విచారిస్తున్న సీబీఐ

CBI questioning YSRCP MP Magunta Sreenivasulu Reddy son in Delhi liquor scam
  • లిక్కర్ స్కామ్ దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ
  • మనీశ్ సిసోడియా, అరుణ్ పిళ్లై, రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు
  • హైదరాబాద్, విజయవాడ, గుంటూరుల్లో సీబీఐ తనిఖీలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో 10 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. 

మరోవైపు ఈ కేసు విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా హాజరయ్యారు. సిసోడియాతో పాటు అరుణ్ పిళ్లైని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది. మాగుంట కుమారుడిని ప్రశ్నిస్తుండటం ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ఫార్మా కంపెనీ ఎండీని సైతం సీబీఐ విచారిస్తోంది.
Delhi Liquor Scam
CBI
Manish Sisodia
AAP
Magunta Sreenivasulu Reddy
Son
Raghava Reddy

More Telugu News