Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధక్ష ఎన్నికల్లో ఓటేసిన సోనియా గాంధీ

Sonia casts her vote in congress presidential elections in Delhi
  • ప్రియాంక వాద్రా, మల్లికార్జున ఖర్గే, చిదంబరం, జైరాం రమేశ్ కూడా
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్
  • ఢిల్లీలో ఓటేయనున్న 280 మంది ప్రతినిధులు
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీనియర్ లీడర్లు చిందబరం, జైరాం రమేశ్ తదితరులు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీలో ఓటేశారు.

 పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల దాకా కొనసాగుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. 

ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. చాలాకాలంగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, పార్టీ వర్కర్ల చేతుల్లోనే కాంగ్రెస్ భవిష్యత్తు ఉందని పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న శశిథరూర్ వ్యాఖ్యానించారు.
Sonia Gandhi
cong
elections
Priyanka Gandhi
Kharge

More Telugu News