Arjun Erigaisi: చెస్ వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ ను చిత్తుచేసిన 19 ఏళ్ల అర్జున్ ఇరిగైసి

Indian GM Arjun Erigaisi beat world champion Magnus Carlsen
  • మాగ్నస్ కార్ల్ సన్ కు కొరకరానికొయ్యల్లా భారత గ్రాండ్ మాస్టర్లు
  • ఇటీవలే కార్ల్ సన్ ను మూడుసార్లు ఓడించిన ప్రజ్ఞానంద
  • తాజాగా ఎయిమ్ చెస్ టోర్నీలో అర్జున్ ఇరిగైసి విజయం
  • 54 ఎత్తుల్లో కార్ల్ సన్ కథ ముగించిన వైనం
చెస్ లో రారాజుగా పేరుప్రతిష్ఠలున్న నార్వే ఆటగాడు, వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ ఇటీవల తరచుగా భారత గ్రాండ్ మాస్టర్ల చేతిలో ఓడిపోతున్నాడు. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద... మాగ్నస్ కార్ల్ సన్ ను నెలరోజుల వ్యవధిలో మూడుసార్లు ఓడించి చెస్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. 

తాజాగా మరో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి కూడా మాగ్నస్ కార్ల్ సన్ ను చిత్తు చేశాడు. ఎయిమ్ చెస్ రాపిడ్ ఆన్ లైన్ టోర్నీలో 19 ఏళ్ల అర్జున్ ఇరిగైసి ఏడో రౌండ్ లో కార్ల్ సన్ పై నెగ్గాడు. ఈ పోరులో 54 ఎత్తుల్లో కార్ల్ సన్ ఆట కట్టించాడు.

గత నెలలోనే అర్జున్ ఇరిగైసి జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్ లైన్ టోర్నీలో కార్ల్ సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇప్పుడా ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. వరల్డ్ చాంపియన్ ఆటగాడిపై గెలవడం అర్జున్ కు ఇదే తొలిసారి.
Arjun Erigaisi
Magnus Carlsen
Chess
Aimchess Rapid Tourney
India
Norway

More Telugu News