Vishwaksen: చరణ్ నుంచి నేను నేర్చుకోవలసింది అదే: విష్వక్సేన్

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ఓరి దేవుడా'
  • విష్వక్సేన్ సరసన ఇద్దరు కథానాయికలు 
  • ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
Ori Devuda Pre release event

విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమా రూపొందింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో, మిథిల పాల్కర్ .. ఆశా భట్ కథానాయికలుగా పరిచయమవుతున్నారు. ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ నటించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలోని మంజీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరు కాగా, అభిమానుల సమక్షంలో ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై విష్వక్సేన్ మాట్లాడుతూ .. "ఈ ఈవెంట్ కి చరణ్ ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చరణ్ చాలా డిసిప్లిన్ గా ఉంటారని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఆయనలా ఉండాలని నేను అనుకుంటూ ఉంటానుగానీ కుదరడం లేదు.

చరణ్ ను ఇప్పుడు చాలా దగ్గారగా చూస్తున్నాను. ఆయన 'ఆరా' ఏమిటనేది నాకు అర్థమవుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్ గారు ఒక ప్రత్యేకమైన రోల్ చేయడం ఒక ఎత్తయితే .. చీఫ్ గెస్టుగా చరణ్ రావడం మరో ఎత్తు. ఈ సినిమాకి సంబంధించి ఈ రెండు విషయాలు నా లైఫ్ టైమ్ గుర్తుండిపోతాయి. ఈ సినిమాను అశ్వత్ మారిముత్తు చాలా గొప్పగా తీశాడు. ఆయన టాప్ డైరెక్టర్ కావడం ఖాయమనే సంగతి నాకు అర్థమైపోయింది. 

ఇది ఏ ఒక్క జోనర్ కి పరిమితం కాదు. అన్ని తరగతుల ప్రేక్షకుల హృదయాలను కదిలించే సినిమా. దీపావళికి మూడు రోజుల ముందుగానే ఈ సినిమా థియేటర్లకు వస్తుంది .. మీరంతా చూడండి. రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా ఇది. ఇప్పుడు నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. సక్సెస్ మీట్లో మాట్లాడదామనే ఉద్దేశంతో ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.  

More Telugu News