Janasena: మంత్రుల‌పై దాడి జ‌రిగితే పోలీసులు ఏం చేస్తున్న‌ట్లు?... కోడిక‌త్తి పంథాలోనే వైసీపీ హ‌డావిడి: నాదెండ్ల మ‌నోహ‌ర్‌

janasena pac chairman nadendla manohar reacts on ysrcp allegations over attack on ministers
  • జ‌న‌సేన దాడుల సంస్కృతిని ప్రోత్స‌హించ‌ద‌న్న నాదెండ్ల‌
  • కోడి క‌త్తి పంథాలోనే వైసీపీ హ‌డావిడి చేస్తోంద‌ని ఎద్దేవా
  • ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే దాడి అంటూ వైసీపీ నాట‌కాల‌ని విమ‌ర్శ‌
విశాఖ విమానాశ్ర‌యం స‌మీపంలో మంత్రులు రోజా, జోగి ర‌మేశ్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిల కార్ల‌పై జ‌న సైనికులు దాడి చేశార‌న్న వార్త‌లపై జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్పందించారు. జ‌న‌సేన ఎప్పుడూ దాడుల సంస్కృతిని ప్రోత్స‌హించ‌ద‌ని ఆయ‌న అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌నపై నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే వైసీపీ నేత‌లు దాడి అంటూ అధికార పార్టీ నాట‌కాలు ఆడుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో విశాఖ విమానాశ్ర‌యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన కోడి క‌త్తి దాడిని నాదెండ్ల‌ ప్ర‌స్తావించారు. గ‌తంలో విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి క‌త్తి హడావిడి చేశార‌ని ఆయ‌న అన్నారు. కోడి క‌త్తి కేసు ఇప్ప‌టికీ ఏమైందో ఎవ‌రూ తేల్చ‌లేద‌న్నారు.

కోడి క‌త్తి పంథాలోనే వైసీపీ నేతలు ఇప్పుడు దాడి జ‌రిగింద‌ని హ‌డావిడి చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇద్ద‌రు మంత్రుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని, మంత్రుల‌పై దాడి జ‌రిగితే పోలీసులు ఏం చేస్తున్న‌ట్లు? అని ఆయన ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌కు స‌రిప‌డ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని డీజీపీకి లేఖ రాశామ‌ని, అయినా కూడా నామ‌మాత్రంగానే భ‌ద్ర‌త క‌ల్పించార‌ని నాదెండ్ల ఆరోపించారు.
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
YSRCP
Vizag

More Telugu News