యూరీ సెక్టార్లో భారత సైనికులతో విజయ్ దేవరకొండ... ఫొటోలు ఇవిగో!
- జమ్మూ కశ్మీర్ లో విజయ్ దేవరకొండ
- ఆర్మీ జవాన్లతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో
- ఫైరింగ్ రేంజ్ లో తుపాకీ చేతబట్టిన వైనం
అంతేకాదు, ఆర్మీ ఫైరింగ్ రేంజ్ ని సందర్శించి, తుపాకీ కాల్చడంపై అక్కడి జవాన్లను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి టార్గెట్ బోర్డుపై తుపాకీ ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత సరిహద్దుల్లో శత్రు భీకర పోరాట యోధులను కలుసుకున్నానని వెల్లడించారు.
