Pawan Kalyan: విశాఖలో నేడు పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ... రూట్ మ్యాప్ ఇదే!

Janasena releases Pawan Kalyan Vizag rally rout map
  • ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ మూడ్రోజుల పర్యటన
  • నేడు విశాఖ వస్తున్న జనసేనాని
  • ఎయిర్ పోర్టు నుంచి నోవోటెల్ వరకు భారీ ర్యాలీ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు విశాఖపట్నం వస్తున్నారు. ఈ మధ్యాహ్నం విశాఖలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ వెల్లడించింది ఈ మేరకు ర్యాలీ రూట్ మ్యాప్ వివరాలను జనసేన పార్టీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. 

తొలుత పవన్ వైజాగ్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమై ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సిరిపురం సర్కిల్, పార్క్ హోటల్, ఎన్టీఆర్ విగ్రహం (బీచ్ రోడ్) మీదుగా నోవోటెల్ వద్ద ముగుస్తుంది. ఇవాళ వైసీపీ కూడా విశాఖ గర్జన పేరిట నగరంలో భారీ కార్యక్రమానికి తెరదీసిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Rally
Rout Map
Janasena

More Telugu News