Chandrababu: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్న చంద్రబాబు

Chandrababu to go to NTR Bhavan
  • తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి
  • మధ్నాహ్నం 3 గంటలకు కీలక నేతలతో భేటీకానున్న బాబు
  • టీటీడీపీ అధ్యక్షుడిగా కాసానిని నియమించే అవకాశం
తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేసే పనిలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, నియోజకవర్గాల కమిటీ సభ్యులతో ఆయన భేటీ కానున్నారు. 

ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నిన్న మళ్లీ టీడీపీలో చేరారు. ఈ క్రమంలో బక్కని నరసింహులు స్థానంలో కాసానిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాసాని గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
Chandrababu
Telugudesam
NTR Bhavan
Kasani

More Telugu News