Global Hunger Index: ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్

Global Hunger Index 2022 India slips six places ranked 107 of 121 countries
  • గతేడాదితో పోలిస్తే ఆరు స్థానాలు దిగువకు 
  • 121 దేశాల అంతర్జాతీయ సూచీలో 107వ స్థానం
  • చిన్నారుల్లో పోషకాల లోపం, ఎదుగుదల లేపోవడం కారణాలు

అభాగ్యులు ఈ దేశంలో ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. ఇందుకు నిదర్శనం అంతర్జాతీయ ఆకలి సూచీ 2022 ర్యాంకులే. భారత్ క్రితం ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు కిందకు వెళ్లిపోయింది. 107వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 121 దేశాలతో ఈ సూచీ ర్యాంకుల నివేదిక విడుదలైంది. అంతర్జాతీయ ఆకలి సూచీలో దేశాల ర్యాంకు కేటాయింపునకు ప్రధానంగా చూసే అంశాలు.. పోషకాహార లేమి (కావాల్సినన్ని కేలరీలు లభించకపోవడం), చిన్నారుల మరణాలు, వృద్ధి సరిగ్గా లేకపోవడం, బరువు తక్కువ ఉండడం. 

దక్షిణాసియా దేశాల్లో అప్ఘానిస్థాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉండడం గమనించాలి. పాకిస్థాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 74వ ర్యాంకుల్లో నిలిచాయి. భారత్ కంటే దిగువన ఉన్నవి జాంబియా, అప్ఘనిస్థాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియెర్రా లియోన్, లెసోతో తదితర దేశాలున్నాయి. 

  • Loading...

More Telugu News