Kodali Nani: గుడివాడలో హరికృష్ణను చిత్తుగా ఓడించింది కొడాలి నాని కాదా?: రావి వెంకటేశ్వరరావు

TDP Leader Ravi Venkateswara Rao Fires on Kodali Nani Over Harikrishna Defeat in Gudivada
  • కొడాలి నానిపై నమ్మకంతో హరికృష్ణ గుడివాడ నుంచి గంట గుర్తుపై పోటీ చేశారన్న వెంకటేశ్వరరావు
  • కార్యకర్తలతో కలిసి నాని ఆయనను ఓడించారని ఆగ్రహం
  • గుడివాడ ప్రజలు గుణపాఠం చెబుతారన్న టీడీపీ నేత
కొడాలి నానిపై నమ్మకంతో నందమూరి హరికృష్ణ గుడివాడలో గంట గుర్తుపై పోటీ చేస్తే కొడాలి నాని చిత్తుగా ఓడించారని టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని టీడీపీ కార్యాలయంలో నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేత కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలో హరికృష్ణను ఓడించింది నాని కాదా? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో హరికృష్ణ పోటీ చేయడాన్ని నాని జీర్ణించుకోలేకపోయారని, కార్యకర్తలతో కలిసి హరికృష్ణను ఓడించారని అన్నారు. 

అలాంటి వెన్నుపోటు మనస్తత్వం ఉన్న నాని ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తుండడం సిగ్గు చేటని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలు చేసే ఆయనకు గుడివాడ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చేసిన తప్పులన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన రోజు వస్తుందని, జైలుకెళ్లక తప్పదని వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
Kodali Nani
YSRCP
Ravi Venkateswara Rao
TDP
Nandamuri Harikrishna

More Telugu News