TDP: దారపనేని నరేంద్రకు చంద్రబాబు పరామర్శ... పార్టీ అండగా ఉంటుంద‌ని భ‌రోసా

chandrababu visits darapaneni narendra home in guntur
  • న‌రేంద్ర‌ను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు
  • గురువారం రాత్రి న‌రేంద్ర‌కు బెయిల్ ఇచ్చిన కోర్టు
  • గుంటూరులోని న‌రేంద్ర ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు
  • న‌రేంద్రకు, ఆయ‌న కుటుంబానికి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత‌
ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టీడీపీ కేంద్ర కార్యాల‌య మీడియా కో ఆర్డినేట‌ర్ దార‌ప‌నేని న‌రేంద్ర‌ను ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌రామ‌ర్శించారు. ఈ కేసులో న‌రేంద్ర‌కు రిమాండ్ విధించేందుకు నిరాక‌రించిన సీఐడీ కోర్టు... గురువారం రాత్రి బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. 

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం గుంటూరులోని న‌రేంద్ర ఇంటికి చంద్ర‌బాబు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర ఆరోగ్యంపై చంద్ర‌బాబు ఆరా తీశారు. సీఐడీ క‌స్ట‌డీలో న‌రేంద్ర‌పై ఏం జరిగిందన్న దానిని కూడా చంద్ర‌బాబు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ని కేసులు పెట్టినా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని న‌రేంద్ర‌కు చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చారు. ఎంత‌మాత్రం అధైర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని న‌రేంద్ర కుటుంబ స‌భ్యుల‌కు చంద్ర‌బాబు ధైర్యం చెప్పారు.
TDP
Chandrababu
Darapaneni Narendra
Guntur
AP CID

More Telugu News