Narendra Modi: ప్రధాని మోదీకి అమరావతి జేఏసీ చైర్మన్ లేఖ

  • రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న జీవీఆర్ శాస్త్రి
  • హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం అడ్డుకుంటోందన్న శాస్త్రి
  • కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విన్నపం
Amaravati JAC chairman writes letter to PM Modi

అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ ప్రధాని మోదీకి అమరావతి జేఏసీ ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి లేఖ రాశారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున ఆయన లేఖ రాశారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి టు అరసవల్లి పాదయాత్రను చేపట్టారని లేఖలో ఆయన తెలిపారు. 

పాదయాత్ర అనుమతి కోసం సెప్టెంబర్ 12న హైకోర్టులో అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసిందని... ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతిని ఇవ్వాలని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. హైకోర్టు ఆదేశించినప్పటికీ పాదయాత్రను అధికార యంత్రాంగం అడుగడుగునా అడ్డుకుంటోందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై హోం సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వాలని విన్నవించారు. పాదయాత్ర చేస్తున్న రైతుల రక్షణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరారు.

More Telugu News