Telangana: మునుగోడు ఉప ఎన్నిక‌ల పోరు నుంచి త‌ప్పుకున్న టీడీపీ

t tdp chief bakkani narsimhulu states that tdp will not contest in munugode bypoll
  • రేప‌టితో మునుగోడులో నామినేష‌న్ల‌కు తెర‌
  • గురువారం టీడీపీ అభ్య‌ర్థిని చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం
  • పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించామ‌న్న బ‌క్క‌ని
  • అంద‌రి అభిప్రాయాల మేర‌కే నిర్ణ‌యం తీసుకున్నామ‌న్న టీ టీడీపీ అధ్య‌క్షుడు
తెలంగాణ‌లో ఆస‌క్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని ఆ పార్టీ తెలంగాణ శాఖ (టీ టీడీపీ) నిర్ణ‌యించింది. ఈ మేర‌కు టీ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బ‌క్క‌ని న‌ర్సింహులు గురువారం అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డం కంటే కూడా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయడంపైనే దృష్టి సారించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. 

మునుగోడు ఉప ఎన్నిక‌లో శుక్ర‌వారంతో నామినేష‌న్ల‌కు గ‌డువు ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో మునుగోడులో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ పార్టీ నేత జ‌క్క‌లి ఐల‌య్య యాద‌వ్ పేరును పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు గురువారం ప్ర‌కటిస్తార‌న్న వార్త‌లు వినిపించాయి. అయితే ఆ ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధంగా ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌రాద‌న్న బక్క‌ని న‌ర్సింహులు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. పార్టీకి చెందిన కీల‌క నేత‌లు, మునుగోడుకు చెందిన క్షేత్ర స్థాయి నేత‌ల‌తో చ‌ర్చించిన మీద‌టే పోటీకి దూరంగా ఉండాలంటూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని బ‌క్క‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.
Telangana
TDP
T TDP
Munugode
Chandrababu
Bakkhani Nasimhulu

More Telugu News