Kodali Nani: టీడీపీపై నాకు అభిమానం లేదు.. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు రుణపడి ఉంటా: కొడాలి నాని

Iam thankful to Harikrishna and Junior NTR says Kodali Nani
  • హరికృష్ణ తనను రాజకీయాల్లోకి తెచ్చారన్న కొడాలి నాని
  • జూనియర్ ఎన్టీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని వ్యాఖ్య
  • చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అన్న నాని
తెలుగుదేశం పార్టీపై తనకు అభిమానం లేదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. హరికృష్ణ తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, జూనియర్ ఎన్టీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని... వీరిద్దరికీ తాను రుణపడి ఉంటానని చెప్పారు. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వీరికి గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరుతో పాదయాత్ర చేపట్టారని విమర్శించారు. 

జీవితంలో తోడు కోసమే లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని కొడాలి నాని చెప్పారు. ఆమెకు ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ అని... అలాంటి ఎన్టీఆర్ ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబును నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పు అని అన్నారు. చంద్రబాబు విశ్వాసం లేని వ్యక్తి అని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబంపై తనకు విశ్వాసం ఉందని చెప్పారు. 

విశాఖలో భూ కుంభకోణం జరిగిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని కొడాలి నాని అన్నారు. రుషికొండను తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని... హైదరాబాద్ లో కొండలు తవ్వి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇళ్లు కట్టుకోలేదా? అని ప్రశ్నించారు.
Kodali Nani
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
NTR
Junior NTR
Lakshmi Parvati

More Telugu News