Team India: ఆసియా కప్ సెమీస్​.. థాయ్​లాండ్​కు 149 పరుగుల లక్ష్యం ఇచ్చిన భారత్​

India sets 149 runs target to Thailand in Asia Cup semis
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్
  • 20 ఓవర్లలో 148/6 స్కోరు
  • రాణించిన షెఫాలీ, హర్మన్, జెమీమా
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. థాయ్ లాండ్ తో గురువారం మొదలైన సెమీఫైనల్లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. దాంతో, ప్రత్యర్థికి భారత్ 149 పరుగుల మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.

మరో ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (2), దీప్తి శర్మ (3) తదితరులు నిరాశ పరిచినా.. జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 3 ఫోర్లతో 27), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 4 ఫోర్లతో 36) రాణించారు. చివర్లో పూజా వస్త్రాకర్ (13 బంతుల్లో 1 సిక్స్ తో 17 నాటౌట్) మెరుపులు మెరిపించింది. థాయ్ లాండ్ బౌలర్లలో సిర్నారిన్ తిపోచ్ (3/24) మూడు వికెట్లతో సత్తా చాటింది. కాగా, ఈ మధ్యాహ్నం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడతాయి.
Team India
womens
asia cup
t20
thailand
target

More Telugu News