Tamil Nadu: ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు కుదిరిన పెళ్లి.. విద్యార్థి ఆత్మహత్య

Tution teacher arrested for student suicide case in tamil nadu
  • తమిళనాడులో ఘటన
  • ట్యూషన్‌కు వెళ్తున్న సమయంలో చిగురించిన ప్రేమ
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • ఉపాధ్యాయురాలి అరెస్ట్
తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు వివాహం నిశ్చయం కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలోని అంబత్తూరులో జరిగిందీ ఘటన. స్థానిక సర్ రామస్వామి ముదలియార్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్లస్ టు చదువుతున్న సమయంలో విద్యార్థి (17).. తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ నడుపుతున్న ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విద్యార్థితో మాట్లాడడం మానేసింది. ఆ తర్వాత అతడిని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. దీంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యాడు.

ఆగస్టు 30న చెన్నైలోని రాజధాని కళాశాలలో కౌన్సెలింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉపాధ్యాయురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తాజాగా ఆమెను అరెస్ట్ చేశారు.
Tamil Nadu
Teacher
Student
Love
Pocso

More Telugu News