Andhra Pradesh: ఏపీలో ముగ్గురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల బ‌దిలీ

ap government transfers 3 senior ips officers
  • విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ డీజీగా సంజ‌య్‌
  • పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీగా వెంక‌ట్రామిరెడ్డి
  • జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ మాదిరెడ్డికి ఆదేశాలు
ఏపీలో ముగ్గురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీగా కొన‌సాగుతున్న సంజ‌య్‌ ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ డీజీగా నియ‌మితుల‌య్యారు. 

సంజ‌య్ బ‌దిలీతో ఖాళీ అయిన పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఎండీగా పి.వెంక‌ట్రామిరెడ్డి నియ‌మితుల‌య్యారు. ఇక మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్ర‌తాప్‌ను సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh
YSRCP
IPS Transfers

More Telugu News