YSRCP: 'జ‌స్టిస్ ఫ‌ర్ సునీత' పేరిట పోరు మొద‌లెట్టిన టీడీపీ నేత ఆనం

tdp leader anam venkata ramana reddy supports ys sunitha fight
  • వైఎస్ వివేకా హ‌త్య కేసులో కుమార్తె సునీత న్యాయ పోరాటం
  • సునీత పోరాటానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌న్న ఆనం
  • #జ‌స్టిస్ ఫ‌ర్ సునీత పేరిట కొత్త పోరును ప్ర‌క‌టించిన వైనం
టీడీపీ నేత ఆనం వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ కొత్త పోరాటాన్ని ప్రారంభించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విష‌యంలో ఆయ‌న కుమార్తె సునీత న్యాయ పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి తాను మ‌ద్ద‌తు తెలుపుతున్నానంటూ ర‌మ‌ణా రెడ్డి బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదికగా ఆయ‌న #జ‌స్టిస్ ఫ‌ర్ సునీత పేరిట పోరాటాన్ని మొద‌లుపెట్టారు. 

'ఆనం అనే నేను వైఎస్ సునీత గారి పోరాటానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాను. మీరు కూడా చేయండి' అంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఓ ఫొటోను విడుద‌ల చేసిన ఆనం...అందులో వివేకానంద‌రెడ్డి బ్యాక్ డ్రాప్‌గా ఓ వైపున సునీత‌, మ‌రోవైపున సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫొటోల‌ను జ‌త చేశారు. ఆ ఫొటోకు జ‌త చేసిన త‌న కామెంట్ కింద #జ‌స్టిస్ ఫ‌ర్ సునీత అని ఆయ‌న పేర్కొన్నారు.
YSRCP
YS Jagan
YS Vivekananda Reddy
YS Sunitha
Anam Venkata Ramana Reddy
Justice For Sunitha

More Telugu News