Munugode: ఏనుగు గుర్తును కారుపైకి ఎక్కించుకుని...భారీ కాన్వాయ్‌తో నామినేష‌న్‌కు బ‌య‌లుదేరిన బీఎస్పీ అభ్య‌ర్థి

bsp candidate shankarachary starts to file nomination with huge convoy
  • మునుగోడులో బీఎస్పీ అభ్య‌ర్థిగా అందోజు శంక‌రాచారి
  • అమ‌ర వీరుల స్థూపానికి నివాళి అర్పించి నామినేష‌న్‌కు బ‌య‌లుదేరిన వైనం
  • ప్రధాన పార్టీల‌కు తీసిపోని రీతిలో ప్ర‌చారం సాగిస్తున్న బీఎస్పీ
మునుగోడు ఉప ఎన్నిక‌లో బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అభ్య‌ర్థి అందోజు శంక‌రాచారి నేడు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. నామినేష‌న్ వేసే ముందు హైద‌రాబాద్ వ‌చ్చిన శంక‌రాచారి అమ‌ర వీరుల స్థూపానికి నివాళి అర్పించి మునుగోడు బ‌య‌లుదేరారు. మునుగోడులో నామినేష‌న్ వేసేందుకు బ‌య‌లుదేరిన ఆయ‌న‌... త‌న వెంట భారీ కాన్వాయ్‌ను తీసుకెళ్లారు. ఈ కాన్వాయ్‌కు ముందు బీఎస్పీ గుర్తుల‌తో అలంక‌రించిన కారుపై అంతెత్తున ఉన్న ఏనుగు గుర్తును నిల‌బెట్టించి మ‌రీ ముందుకు సాగారు. 

మునుగోడులో 75 శాతం మంది బీసీ ఓట‌ర్లే ఉన్నార‌ని, అయితే ప్ర‌ధాన పార్టీలన్నీ అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన వారికే టికెట్లు ఇస్తున్నాయ‌ని బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాము మాత్రం మెజారిటీ ఓట‌ర్లు ఉన్న బీసీల‌కే టికెట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌వీణ్‌... మునుగోడు ఉప ఎన్నిక‌ల అభ్యర్థిగా అందోజు శంక‌రాచారిని ఎంపిక చేశారు. ప్ర‌ధాన పార్టీల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో బీఎస్పీ త‌న ప్ర‌చారాన్ని హోరెత్తిస్తోంది.
Munugode
BSP
R S Praveen Kumar
Andoju Shankarachary

More Telugu News