Jai Shanker: ఆస్ట్రేలియా ఉప ప్రధానికి కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను బహూకరించిన భారత విదేశాంగమంత్రి జైశంకర్

Jai Shankar gifts Kohli signed bat to Australia deputy prime minister
  • ఆసీస్ ఉప ప్రధానితో జైశంకర్ భేటీ
  • భారత్ తరఫున కానుక అందజేత
  • బ్యాట్ అందుకుని ఆశ్చర్యానికి గురైన రిచర్డ్ మార్లెస్
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడి
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మార్లెస్ కు జైశంకర్ అపురూపమైన కానుక అందజేశారు. 

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను బహూకరించారు. ఈ కానుక అందుకున్న ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మార్లెస్ ముఖం వెలిగిపోయింది. క్రికెట్ బ్యాట్ గిఫ్టుగా అందిన విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ కు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత్, ఆస్ట్రేలియాలను అనేక విషయాలు కలిపి ఉంచుతాయని, వాటిలో క్రికెట్ కూడా ఒకటని రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు. ఇరుదేశాలు క్రికెట్ ను ఎంతో ప్రేమిస్తాయని, ఇవాళ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను బహూకరించి జైశంకర్ ఎంతో ఆశ్చర్యపరిచారని వివరించారు.
Jai Shanker
Richard Marles
Bat
Virat Kohli
Sign
India
Australia
Cricket

More Telugu News