Team India: టీమిండియా ఫినిషింగ్ అదిరింది... చివరి వన్డేలో అద్భుత విజయంతో సిరీస్ కైవసం

Team India seals series win after thrashed South Africa in final ODI
  • ఢిల్లీలో నేడు మూడో వన్డే
  • 7 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ
  • మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు
  • 27.1 ఓవర్లలో 99 ఆలౌట్
  • 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
టీమిండియా మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ ను గెలిచిన భారత జట్టు, తాజాగా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 

తొలుత దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కట్టడి చేసిన భారత్... 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు.

అంతకుముందు కెప్టెన్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసిన రనౌట్ కాగా, మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 49 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి ఫోర్టుయిన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శ్రేయాస్ అయ్యర్ 28, సంజు శాంసన్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు. 

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1తో చేజిక్కించుకుంది.
Team India
Series
South Africa
3rd ODI

More Telugu News