KTR: చంద్రబాబు, వైఎస్సారే నయం: కేటీఆర్

KTR fires on BJP
  • మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా పేలుతున్న మాటల తూటాలు
  • అడ్రస్ లేని లవంగం గాళ్లంతా మాట్లాడుతున్నారన్న కేటీఆర్
  • తమ ఆరోపణలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ని బీజేపీ అప్పగించిందని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్ అహం కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. ఉద్యమం సమయంలో ఈ బఫూన్ గాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అడ్రస్ లేని లవంగం గాళ్లంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, వైఎస్సారే బెటర్ అని... ఇప్పుడు బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. పిచ్చోళ్లతో పోరాడాల్సి వస్తోందని చెప్పారు. తాము చేస్తున్న ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

గుజరాత్ వాళ్లు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తున్నప్పుడు... టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కావద్దా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ దేశంలో రాజకీయాలు చేయొద్దా? అని అడిగారు. మన జెండా, గుర్తు మారదని... ఎవరూ తికమక పడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఈడీ, బోడీలతో మనల్ని ఏమీ చేయలేరని అన్నారు.
KTR
TRS
Chandrababu
YSR
Munugode

More Telugu News