SWOTT: రూ.1,099కే చక్కని ఇయర్ బడ్స్

SWOTT AirLIT 004 TWS earbuds launched for Rs1099
  • ఎయిర్ లిట్ 004 ఇయర్ బడ్స్ పేరుతో విడుదల
  • 60 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ అవుతుందని కంపెనీ ప్రకటన
  • 10 ఎంఎం డ్రైవర్లతో మంచి ఆడియో అనుభవాన్ని ఇస్తుందని వెల్లడి
అతి తక్కువ ధరకే మంచి ఫీచర్లతో టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ను దేశీ కంపెనీ స్వాట్ విడుదల చేసింది. ‘ఎయిర్ లిట్ 004 ఇయర్ బడ్స్’ పేరుతో విడుదలైన ఈ ఉత్పత్తి మంచి శబ్ధ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ అంటోంది. మంచి సంగీతాన్ని ఆస్వాదించొచ్చని పేర్కొంది. ఈ కంపెనీ ఇటీవలే ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజాను తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడం గమనార్హం.

ఎయిర్ లిట్ 004 ఇయర్ బడ్స్ చెవిలో ధరించడానికి ఎంతో సౌకర్యంగా ఉంటాయని సంస్థ తెలిపింది. స్లీక్ గా కనిపించే ఇవి, ఐపీఎక్స్ 4 స్వెట్ ప్రూఫ్ (చెమట పడినా పాడవని) తో వస్తాయని ప్రకటించింది. బ్లూటూత్ 5.0 టెక్నాలజీపై పనిచేసే ఇవి 10 మీటర్ల దూరంలో ఉన్నా కానీ వైర్ లెస్ గా కనెక్ట్ అవుతాయని తెలిపింది. బడ్స్ ను కేస్ లో ఉంచిన వెంటనే చార్జ్ అవుతాయని, 400 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జింగ్ కేవలం 60 నిమిషాల్లో పూర్తవుతుందని కంపెనీ వివరించింది. 10 ఎంఎం ఆడియో డ్రైవ్స్ తో వచ్చే ఇవి అద్భుతమైన ఆడియోను అందిస్తాయని పేర్కొంది. దీని ధర రూ.1,099. అమెజాన్, స్వాట్ లైఫ్ స్టయిల్ డాట్ కామ్ పోర్టల్స్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
SWOTT
AirLIT 004
TWS earbuds
Rs1099

More Telugu News