తిరుమలలో గుంటూరు భక్తులపై తమిళనాడు భక్తుల దాడి

  • క్యూ లైన్లో చోటుచేసుకున్న ఘర్షణ
  • టాయ్ లెట్ కు దారి ఇవ్వాలన్న గుంటూరు భక్తులు
  • మాటామాటా పెరిగి కొట్టుకునేంత వరకు వెళ్లిన వైనం
Tamil Nadu devotees attacked Guntur devotees in Tirumala

పవిత్ర ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఏపీ, తమిళనాడు భక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. దర్శనం క్యూ లైన్లో ఈ ఘటన సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గుంటూరు నుంచి వచ్చిన భక్తులపై తమిళనాడు భక్తులు దాడి చేశారు. టాయ్ లెట్ కు వెళ్లేందుకు దారి ఇవ్వాలంటూ తమిళనాడు భక్తులను గుంటూరు భక్తులు కోరారు. 

ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తోపులాటతో ప్రారంభమైన ఘర్షణ చివరకు క్యూ లైన్లోనే కొట్టుకునేంత వరకు వెళ్లింది. పక్కనున్న వారు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ తమిళనాడు భక్తులు ఆగలేదు. ఈ గొడవలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News