Karan Johar: ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన కరణ్ జొహార్

Karan Johar deactivates his Twitter account
  • ట్విట్టర్ అకౌంట్ ను డీయాక్టివేట్ చేసిన కరణ్ జొహార్
  • మరింత పాజిటివ్ వైబ్స్ కోసం గుడ్ బై చెపుతున్నానని వెల్లడి
  • ట్విట్టర్ కు దూరం కావడం సరికాదంటున్న నెటిజన్లు
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేశారు. తన చివరి ట్వీట్ లో... మరింత పాజిటివ్ వైబ్స్ కోసం ట్విట్టర్ కు గుడ్ బై చెపుతున్నానని తెలిపారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ కు దూరం కావడం సరికాదని కొందరు అంటుండగా... ట్విట్టర్ లో ఉండి మాత్రం చేసేదేముందని మరి కొందరు ఎద్దేవా చేస్తున్నారు. 

కరణ్ జొహార్ బాలీవుడ్ లోకి తొలుత నటుడిగా ప్రవేశించారు. ఆ తర్వాత దర్శకత్వ రంగంలోకి ప్రవేశించారు. ఇటీవలి కాలంలో ఆయన పూర్తిగా చిత్ర నిర్మాణంపైనే దృష్టి సారించారు. 
Karan Johar
Bollywood
Twitter

More Telugu News