ఈ ఏనుగు డ్యాన్స్ తో ఇరగదీసిందిగా..!

  • నడిరోడ్డుపై చక్కని స్టెప్పులు వేసిన ఏనుగు
  • ఇది చూసిన వారు ముగ్ధులు కావాల్సిందే
  • తప్పుబడుతున్న జంతు ప్రేమికులు
  • వాటిని సహజంగా బతకనివ్వాలని పిలుపు
Viral video shows elephant dancing on the road But the Internet is not happy

ఏనుగు డ్యాన్స్ చేయడం అంటే శరీరాన్ని అటూ, ఇటూ కదిలిస్తుందిలే.. అంతకుమించి స్టెప్పులు వేయడం దానికి ఎలా సాధ్యం? అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఇక్కడి వీడియోను ఓ సారి చూస్తే అసలు విషయం తెలుస్తుంది. ఏనుగులు సైతం డ్యాన్స్ చేయగలవని ఒప్పుకుని తీరాల్సిందే. వీడియో ఏ ప్రాంతానికి సంబంధించినదో తెలియదు కానీ, అందులో ఒక ఏనుగు చక్కని స్టెప్పులతో అదరగొట్టింది. ఈ వీడియోకు లక్షలాది లైక్స్ వచ్చాయి. 

డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. కానీ, జంతు ప్రేమికులకు మాత్రం ఇది ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. శిక్షకులు కొన్ని సందర్భాల్లో ఈ ఏనుగుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారని, ఇలాంటి వీడియోలకు మద్దతు ఇవ్వొద్దని కోరుతున్నారు. ‘‘జంతువులు ఉన్నది డ్యాన్స్ చేసి సంతోష పెట్టడానికి, మనుషుల కడుపు నింపడానికి కాదు. వాటిని సహజంగా బతకనివ్వండి. జంతువులను హింసించడాన్ని ఆపండి’’అని ఓ యూజర్ పేర్కొన్నాడు. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)

More Telugu News