తెలంగాణలో మరో యానిమల్ వాక్సిన్ యూనిట్... రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐఐఎల్
- ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ వాక్సిన్ తయారీ యూనిట్
- కొత్తగా జీనోమ్ వ్యాలీలో మరో యూనిట్
- ఈ యూనిట్‌తో 750 మందికి ఉపాధి
- ఐఐఎల్ ప్రతిపాదనను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ యానిమల్ వాక్సిన్ ప్లాంట్ ఉంది. ఇందులో ఏడాదికి 300 మిలియన్ వాక్సిన్ డోసులను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న తన తదుపరి యూనిట్‌లో ఏడాదికి మరో 300 మిలియన్ యూనిట్ల వాక్సిన్లను ఉత్పత్తి చేయనుంది. రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 750 మందికి పైగా ఉపాధి లభించనుందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే వాక్సిన్ కేపిటల్ ఆఫ్ వరల్డ్‌గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో ఐఐఎల్ మరో వాక్సిన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుండడం హర్షణీయమని ఆయన తెలిపారు.