వరుణ్ తేజ్ యాక్షన్ మూవీ షూటింగ్ ప్రారంభం!

  • 'గని' తో ఫ్లాప్ అందుకున్న వరుణ్ 
  • 'ఎఫ్ 3' సినిమాతో దక్కిన హిట్ 
  • నెక్స్ట్ మూవీ ప్రవీణ్ సత్తారుతో! 
  • లండన్ లో మొదలైన షూటింగ్  
Varun Tej  and Praveen Sattharu Movie Update

వరుణ్ తేజ్ కి 'గని' సినిమాతో ఫ్లాప్ పడినప్పటికీ, ఆ వెంటనే 'ఎఫ్ 3' సినిమాతో హిట్ పడటంతో సెట్ అయింది. 'గని' సినిమా పరాజయాన్ని జనాలు మరిచిపోయారు. ఆయన తదుపరి సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఉండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిన్నమొన్నటి వరకూ 'ది ఘోస్ట్' సినిమా పనులతో బిజీగా ఉంటూ వచ్చిన ప్రవీణ్ సత్తారు, ఆ సినిమా రిలీజ్ కావడంతో వరుణ్ తేజ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. 

ప్రవీణ్ సత్తారుకి ఇష్టమైన యాక్షన్ జోనర్లోనే ఈ కథ నడవనుంది. ఈ రోజునే ఈ సినిమా షూటింగ్ లండన్ లో మొదలైంది. అందుకు సంబంధించిన అప్ డేట్ ను వదిలారు. కెరియర్ పరంగా ఇది వరుణ్ తేజ్ కి 12వ సినిమా.  బీవీఎన్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'గరుడ వేగ' సినిమాను యాక్షన్ సీన్స్ నిలబెట్టాయి. 'ఘోస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, యాక్షన్ సీన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. మరోమారు, అలాంటి యాక్షన్ కి ప్రాధాన్యతనిస్తూ ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా ప్రవీణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

More Telugu News