ఇన్ఫోసిస్ పై అమెరికా కోర్టులో దావా వేసిన మాజీ ఉన్నతోద్యోగి
- ఇన్ఫోసిస్ పై అమెరికా కోర్టులో వ్యాజ్యం వేసిన మాజీ వైస్ ప్రెసిడెంట్
- చట్ట విరుద్ధ, వివక్షా విధానాలు అనుసరిస్తున్నట్టు ఆరోపణ
- మార్చడానికి ప్రయత్నించగా, వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు వివరణ

ఇన్ఫోసిస్ కు వ్యతిరేకంగా ఆ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్/మానవ వనరుల నియామకం విభాగం) జిల్ ప్రెజీన్ అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. భారత మూలాలు కలిగిన, పిల్లలు కలిగిన మహిళలను, 50 ఏళ్లు దాటిన వారిని నియమించుకోవద్దని తనను ఇన్ఫోసిస్ కోరినట్టు పేర్కొన్నారు. అమెరికాలో వివక్షాపూరిత ఉద్యోగ నియామకాలకు వ్యతిరేకంగా ఇన్ఫోసిస్ ఎదుర్కొంటున్న రెండో న్యాయ వ్యాజ్యం ఇది.