Rashmika Mandanna: విజయ్ తో రిలేషన్ షిప్ పై స్పందించిన రష్మిక మందన్న

Rashmika Mandanna says Vijay Deverakonda is always there for her
  • విజయ్, తాను ఎంతో సన్నిహిత మిత్రులం అని ప్రకటించిన రష్మిక
  • తన కోసం విజయ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడన్న నటి
  • సోషల్ మీడియాలో నడుస్తున్న దానిపై తాము చర్చించుకోలేదని వివరణ
విజయ్ దేవరకొండతో తనకున్న అనుబంధంపై రష్మిక మందన్న స్పందించింది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక.. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో తన రిలేషన్ షిప్ పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల పట్ల స్పందించింది. 

‘‘మేము నటులం. కనుక మావైపు లైట్లు ఆన్ చేసి ఉంటాయని తెలుసు. ప్రజలు మా గురించి ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఏం నడుస్తోందో నేను చూశాను. కొన్ని వీడియోలు కూడా చూశాను. ఎంతో క్యూట్ గా ఉంది. నిజానికి విజయ్, నేను కూర్చుని ఎప్పుడూ దీనిపై చర్చించలేదు. మాకు 15 మందితో కూడిన గ్యాంగ్ ఉంది. అవకాశం లభిస్తే అందరం కలసి గేమ్స్ ఆడతాం. నటులమైనప్పటికీ మాకు స్నేహితులు కూడా ముఖ్యమే.

నేను విజయ్ కు ఎంతో సన్నిహితురాలినని తెలుసు. అందుకే పరిశ్రమ గురించి ఏదైనా అడగాలనుకుంటే నేరుగా వెళ్లి విజయ్ ను అడుగుతాను. నాకోసం అతడు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. మేము నిజంగా ఎంతో సన్నిహిత మిత్రులం. మేము ఎన్నో విషయాలు పంచుకుంటూ, చర్చించుకుంటాం. 

కెరీర్ ఆరంభంలో మేము ఇద్దరం కలసి పెద్ద సినిమాలు చేశాం. ఇప్పుడు అతడు పాన్ ఇండియా సినిమా లైగర్ లో నటించాడు. అతడికి ఎంతో ఆదరణ లభిస్తోంది. నేను హిందీ మూవీ గుడ్ బైలో చేశాను. మా ఇద్దరి కెరీర్ లు భిన్నమైనవి. మేము ఒకరి ప్రయాణాన్ని మరొకరు నడిపించడం లేదు. కనుక ఒకరి కోసం మరొకరు మాట్లాడుకోలేదు’’అని రష్మిక తన అంతరంగంలోని విషయాలను పంచుకుంది.
Rashmika Mandanna
react
responded
Vijay Deverakonda
relationship
rumors

More Telugu News