Junior NTR: ఎన్టీఆర్ జోడీగా సందడికి సై అనేసిన శ్రీలీల!

  • శ్రీలీల తాజా చిత్రంగా రానున్న 'ధడాక'
  • నితిన్ జోడీ కడుతున్న భామ 
  • రీసెంట్ గా రామ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ 
  • కొరటాల సినిమాకి ఓకే చెప్పిందంటూ టాక్   
Sree Leela in Korala Movie

ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక టాక్ వినిపించింది.
 
ఈ సినిమా కోసం ముందుగా అలియా భట్ పేరు వినిపించినప్పటికీ, ఆ తరువాత పూజ హెగ్డే .. రష్మిక .. కియారా అద్వాని పేర్లు తెరపైకి వచ్చాయి. మొదటి కథానాయికగా ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక రెండవ కథానాయికగా శ్రీలీలను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైందనే అంటున్నారు. 

'పెళ్లి సందD' సినిమాతో పరిచయమైన ఈ భామ, త్వరలో 'ధమాకా'తో పలకరించనుంది. బాలకృష్ణ .. నితిన్ సినిమాలలోను కనిపించనుంది. రీసెంట్ గా రామ్ - బోయపాటి సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

More Telugu News