Rishabh Pant: ఆస్ట్రేలియాకు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. పంత్ కోసమేనా?

Urvashi Rautela gets trolled for landing in Australia ahead of T20 World Cup
  • నా హృదయాన్ని అనుసరిస్తూ వచ్చా.. అంటూ రౌతేలా పోస్టు
  • పంత్ కోసమేనా? అంటూ నెటిజన్ల ప్రశ్న
  • నాలుగేళ్ల క్రితం నుంచే వారి మధ్య ఏదో ఉన్నట్టు ఊహాగానాలు
బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియా ఫ్లైటెక్కడం అటు బాలీవుడ్‌లోనూ, ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్‌పంత్ ప్రేయసిగా వార్తల్లోకి ఎక్కిన ఆమె పంత్‌ను కలిసేందుకే ఆసీస్ విమానమెక్కినట్టు చెబుతున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ నేపథ్యంలో అతడితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా వెళ్లినట్టు చెబుతున్నారు.

దీనికి తోడు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూడా ఇందుకు ఊతమిస్తోంది. ‘నా హృదయాన్ని అనుసరిస్తూ వచ్చా’ అన్న క్యాప్షన్‌తో విమానంలో ఉన్న ఫొటోను ఊర్వశి షేర్ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్లింది పంత్ కోసమేనా? అని ఒకరంటే.. పంత్ నీ కోసం అక్కడ వేచి చూస్తున్నాడు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

పంత్-ఊర్వశి మధ్య ఏదో నడుస్తున్నట్టు నాలుగేళ్ల క్రితమే పుకార్లు షికారు చేశాయి. 2018లో వీరిద్దరూ ఓ రెస్టారెంట్‌లో కనిపించారు. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారన్న వార్తలు కూడా వినిపించాయి. కాగా, ఊర్వశితో డేటింగ్ వార్తలను పంత్ ఇప్పటికే కొట్టిపడేశాడు. మరిప్పుడు రౌతేలా ఎవరి కోసం వెళ్లినట్టో!!
Rishabh Pant
Urvashi Rautela
Bollywood
Team India

More Telugu News