MK Stalin: డీఎంకే అధినేతగా స్టాలిన్ మరోసారి ఏకగ్రీవం

  • ఇటీవల ఏర్పాటైన డీఎంకే జనరల్ కౌన్సిల్
  • నేడు చెన్నైలో సమావేశం
  • స్టాలిన్ నాయకత్వానికే మొగ్గుచూపిన డీఎంకే నేతలు
  • ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్
  • కోశాధికారిగా టీఆర్ బాలు
Stalin unanimously elected as DMK Party Chief for the second time

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఏర్పాటైన డీఎంకే జనరల్ కౌన్సిల్ ఇవాళ చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశంలో, డీఎంకే నేతలు స్టాలిన్ నాయకత్వానికే ఓటేశారు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నేత దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం స్టాలిన్ తో పాటు దురైమురుగన్, టీఆర్ బాలు ఈ పదవులు చేపట్టడం ఇది రెండోసారి. 

తండ్రి కరుణానిధి మరణానంతరం స్టాలిన్ 2018లో తొలిసారి డీఎంకే చీఫ్ గా ఏకగ్రీవం అయ్యారు. 69 ఏళ్ల స్టాలిన్ గతంలో డీఎంకే పార్టీలో కోశాధికారిగానూ, పార్టీ యువజన విభాగం కార్యదర్శిగానూ వ్యవహరించారు.

More Telugu News