tennis: తండ్ర‌యిన దిగ్గ‌జ టెన్నిస్ ఆట‌గాడు

Rafael Nadal becomes father to first child with wife Maria Francisca Perello
  • స్పెయిన్ బుల్ ర‌ఫెల్ నాద‌ల్‌కు కొడుకు
  • శ‌నివారం రాత్రి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అత‌ని భార్య ఫ్రాన్సిస్కా
  • 2019లో ఫ్రాన్సిస్కాను పెళ్లి చేసుకున్న నాద‌ల్
దిగ్గ‌జ టెన్నిస్ ఆట‌గాడు ర‌ఫెల్ నాద‌ల్ తొలిసారి తండ్ర‌య్యాడు. స్పెయిన్ బుల్ నాద‌ల్ భార్య మ‌రియా ఫ్రాన్సిస్కా పెరెలో శనివారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. త‌మ కొడుకుకు ర‌ఫెల్ అని పేరు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. నాదల్, మరియా 2019లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నాద‌ల్ వ‌య‌సు 36 ఏళ్లు. టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో అత్య‌ధికంగా 22 గాండ్ స్లామ్స్ సాధించి రికార్డు నెల‌కొల్పాడు. ఏటీపీ పురుషుల ర్యాంకింగ్ లో నాదల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. మొద‌టి స్థానంలో స్పెయిన్‌కే చెందిన య‌వ సంచలనం కార్లోస్ అల్క‌రాజ్ గార్సియా ఉన్నాడు. 

తండ్ర‌యిన నాద‌ల్‌కు సెర్బియా టెన్నిస్ వీరుడు నొవాక్ జొకోవిచ్ శుభాకాంక్షలు తెలిపాడు. "కంగ్రాట్. నాకు ఇప్పటిదాకా తెలియదు. అది అద్భుత‌మైన వార్త‌. నాద‌ల్‌, అత‌ని భార్య‌, బిడ్డ ఆరోగ్యం, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నా. ఒక తండ్రిగా నేను అతనికి ఎటువంటి సలహా ఇవ్వను (నవ్వుతూ). ఆయనకు పెద్ద కుటుంబం ఉంది. నాద‌ల్‌ తనను తాను అనుభూతి చెందుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను (నవ్వుతూ)" అని ట్వీట్ చేశాడు.
tennis
Rafale nadal
father
first child

More Telugu News