Odisha: ప్రముఖులను వలలో వేసుకుని.. ఆపై బెదిరించి డబ్బులు గుంజుతున్న యువతి అరెస్ట్

Bhubaneswar Woman Arrested for Honeytrapping Politician Film Producer and Businessmen
  • ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఘటన
  • తన అందచందాలతో ప్రముఖులకు వల
  • ఖరీదైన కార్లు, ఫామ్ హౌస్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
  • అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
అందచందాలతో ప్రముఖులను తన ఉచ్చులోకి లాగి ఆపై ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు, ఫొటోలు చూపించి బెదిరిస్తున్న మాయలాడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన యువతికి విశాలమైన భవనం ఉంది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుని, ఆ తర్వాత తన ప్లాన్‌ను అమలు చేస్తుంది. తన అందం, మాటలతో వారిని కవ్వించి తన ఇంటికి రప్పిస్తుంది. వారితో సన్నిహితంగా ఉంటూ వాటిని రహస్యంగా తన ఫోన్‌లో చిత్రీకరించేది. ఆపై వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించేది. అడిగినంత ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించేది.  

కొందరు పోలీసులు ఉన్నతాధికారులు, ఓ సినీ నిర్మాత, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఆమె వలలో చిక్కుకోవడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమె నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని వీడియోలు, ఫొటోల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అలాగే, బీఎండబ్ల్యూ, ఫోర్డ్ తదితర ఖరీదైన కార్లతోపాటు ఓ ఫామ్ హౌస్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
Odisha
Bhubaneswar
Young Girl
Honey Trap

More Telugu News