YSRCP: రాజీనామా ఆమోదం పొందితే టీచర్ పోస్టులో చేరిపోతా: కరణం ధర్మశ్రీ

If teachedr post comes near Chodavaram will join Says Karanam Dharmasri
  • విశాఖ రాజధానికి మద్దతుగా కరణం ధర్మశ్రీ రాజీనామా
  • 1998 డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు టీచర్ పోస్టులు
  •  పరిశీలన కోసం ధ్రువపత్రాలు పంపానన్న వైసీపీ నేత

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశాఖ రాజధానికి అనుకూలంగా ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ  రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అంశం తెరపైకి వచ్చింది. 

1998లో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మినిమమ్ టైం స్కేల్‌పై నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇలా ఎంపికైన వారిలో ధర్మశ్రీ  కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్హత పత్రాలను సమర్పించారా? అన్న విలేకరుల ప్రశ్నకు ధర్మశ్రీ స్పందిస్తూ.. విద్యార్హతకు సంబంధించి  ధ్రువపత్రాలను పంపాలని కోరడంతో తాను పంపానని, తన రాజీనామా ఆమోదం పొందితే కనుక చోడవరం, దాని సమీపంలోని పీఎస్‌పేటలో ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతానని నవ్వుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News