David Miller: దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట విషాదం.. కేన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసిన కుమార్తె!

RIP my little rockstar writes David Miller as he shares heart wrenching video
  • కేన్సర్‌తో పోరాడుతూ మరణించిన చిన్నారి
  • అతడి కుమార్తె కాకపోయి ఉండొచ్చంటున్న కొన్ని మీడియా సంస్థలు
  • ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న మిల్లర్
సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట తీరని విషాదం నెలకొంది. అతడి గారాల పట్టి కేన్సర్‌తో కన్నుమూసింది. మిల్లర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’’ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. కాగా, మిల్లర్.. ‘మై లిటిల్ రాక్ స్టార్’ అని సంబోధించినప్పటికీ ఎక్కడా తన కుమార్తె అని పేర్కొనకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిన్నారి అతడి కుమార్తె అయి ఉండదని అంటున్నారు. మీడియా సంస్థల్లో అత్యధికం చనిపోయిన చిన్నారి మిల్లర్ కుమార్తెగానే చెబుతుండగా, మరికొన్ని మాత్రం అతడికి బాగా దగ్గరైన అభిమాని అంటున్నారు. మిల్లర్ కూడా తమ మధ్య బంధాన్ని వెల్లడించకపోవడంతో ఆ చిన్నారి ఎవరన్న విషయం మిస్టరీగా మారింది. 

కాగా, మిల్లర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా జట్టులో సభ్యుడు. నేడు రాంచీలో భారత్-సఫారీల మధ్య రెండో వన్డే జరగాల్సి ఉంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా, మిల్లర్ పోస్టుతో సౌతాఫ్రికా జట్టులో విషాద ఛాయలు అలముకున్నాయి.
David Miller
South Africa
Little Rockstar
Cancer

More Telugu News