స్కూటీపైనే ఎమ్మెల్యే గ‌ణేశ్!... ఇలా కింద‌ప‌డ్డారు!

  • నర్సీప‌ట్నంలో బైక్ ర్యాలీ చేప‌ట్టిన ఉమాశంక‌ర్ గ‌ణేశ్
  • ప‌క్క‌నున్న బైక్ ఢీకొట్ట‌డంతో కింద ప‌డ్డ వైసీపీ ఎమ్మెల్యే
  • సోష‌ల్ మీడియాలో ప్ర‌మాదం వీడియో
a vedio shows how ysrcp mla uma shankar ganesh fel down from scooty

వైసీపీ స‌ర్కారు ప్ర‌తిపాదించిన 3 రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఆ పార్టీకి చెందిన న‌ర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ గ‌ణేశ్ బైక్ ర్యాలీలో పాల్గొన్న సంద‌ర్భంగా ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో స్కూటీపై నుంచి కింద ప‌డ్డ గ‌ణేశ్ కాలికి తీవ్ర గాయ‌మే అయ్యింది. ఆప‌రేష‌న్ త‌ప్ప‌దంటూ వైద్యులు కూడా ఆయ‌న‌కు సూచించారు. తాజాగా స్కూటీపై నుంచి గ‌ణేశ్ కింద ప‌డ్డ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. 

న‌ర్సీపట్నంలో బైక్ ర్యాలీకి పిలుపునిచ్చిన గ‌ణేశ్... తాను స్కూటీపై ముందుగా వెళుతున్నారు. గ‌ణేశ్ స్కూటీని అనుస‌రించి ఆయ‌న అనుచ‌రులు పెద్ద సంఖ్య‌లోనే బైక్‌ల‌పై బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో గణేశ్ స్కూటీకి కుడి వైపున బైక్‌పై వ‌స్తున్న వైసీపీ కార్య‌క‌ర్త త‌న‌కు కుడి వైపున ఉన్న బైక్ అలా చిన్న‌గా త‌గ‌ల‌గానే... కంట్రోల్ త‌ప్పి గ‌ణేశ్ స్కూటీని ఢీకొట్టాడు. దీంతో గ‌ణేశ్ స్కూటీతో పాటు ఆ కార్య‌క‌ర్త బైక్ కూడా ఒక‌దానిపై ఒక‌టి ప‌డిపోయాయి. ఈ ప్ర‌మాదంలో గ‌ణేశ్ కాస్తంత ఎగిరి ప‌డ్డ‌ట్టుగా క‌నిపించారు.

More Telugu News