ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. కొత్త ఐఏఎస్ లకు పోస్టింగులు!

AP govt transfers few IAS officers
  • పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా విజయసునీత 
  • ఏపీ సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ గా కట్టా సింహాచలం 
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సమీర్ శర్మ
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు కేటాయించింది. ఇదే సమయంలో కొందరిని బదిలీ చేసింది. పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా విజయసునీతను, గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్ గా భావనను, శ్రీకాకుళం జేసీగా నవీన్ ను, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణు చరణ్ ను, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ గా నిధి మీనాను, ఏపీ సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ గా కట్టా సింహాచలంను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులను జారీ చేశారు. 

ఇదే సమయంలో 2020 బ్యాచ్ కు చెందిన యువ ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ లను కేటాయించారు. 

కొత్త సబ్ కలెక్టర్ల వివరాలు:
  • రంపచోడవరం - శుభం బన్సాల్
  • నరసాపురం - సూర్య తేజ
  • తెనాలి - గీతాంజలి శర్మ
  • టెక్కలి - రాహుల్ కుమార్ రెడ్డి
  • ఆదోని - అభిషేక్ కుమార్
  • పాలకొండ - నూర్ కౌమర్
  • విజయవాడ - అదితి సింగ్
  • పెనుకొండ - కార్తీక్
  • గూడూరు - శోభిక
  • కందుకూరు - మాధవన్
  • పార్వతీపురం ఆర్డీవో - హేమలత.
Go Back to Shorts
Andhra Pradesh
IAS
Tranfers

More Telugu News