Telangana: మ‌నుగోడు ఉప ఎన్నిక‌లో బీఎస్పీ అభ్య‌ర్థిగా అందోజు శంక‌రాచారి

Shankara Chary is the bsp candidate for munugode bypolls
  • బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన శంక‌రాచారి
  • మునుగోడులో బీసీల ఓట్లే ఎక్కువ అన్న ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
  • సామాజిక న్యాయంలో భాగంగా బీసీల‌కే టికెట్ ఇస్తున్న‌ట్టు వెల్ల‌డి
  • శంక‌రాచారికి బీఫామ్ అందించిన ప్ర‌వీణ్‌
మునుగోడు ఉప ఎన్నిక‌ల బ‌రిలో శ‌నివారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) శ‌నివారం త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన అందోజు శంక‌రాచారిని త‌మ పార్టీ అభ్య‌ర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా శంక‌రాచారికి ఆయ‌న పార్టీ బీఫామ్‌ను కూడా అంద‌జేశారు. 

మునుగోడు అసెంబ్లీలో అత్య‌ధిక సంఖ్య‌లో బీసీల ఓట్లే ఉన్నాయని గ‌త కొంత‌కాలంగా చెబుతూ వ‌స్తున్న ప్ర‌వీణ్ కుమార్.. ఆ సామాజిక వ‌ర్గానికి ఇప్ప‌టిదాకా ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేసే అవ‌కాశ‌మే ఇవ్వ‌లేద‌ని ఆరోపిస్తున్నారు. సామాజిక న్యాయమే ల‌క్ష్యంగా సాగుతున్న బీఎస్పీ మాత్రం మునుగోడులో బీసీల‌కు టికెట్ ఇస్తుంద‌ని కూడా ప్ర‌వీణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే శంక‌రాచారికి బీఎస్పీ టికెట్ ప్ర‌క‌టించారు.
Telangana
Nalgonda District
Munugode
BSP
R S Praveen KUmar
Shankara Chary

More Telugu News