Telangana: ఈ ప‌ట్టుచీర సువాస‌న‌ల‌తో గుభాళిస్తుంది!

  • 27 సుగంధ ద్ర‌వ్యాల‌తో రూపొందిన‌ ప‌ట్టు చీర 
  • సిరిసిల్ల చేనేత కార్మికుడు న‌ల్ల విజ‌య్ చేతుల్లో రూప‌క‌ల్ప‌న‌
  • ఆవిష్క‌రించిన మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు
sircilla handloom worker makes a silk saree with 27 scents

తెలంగాణ‌లోని సిరిసిల్ల చేనేత కార్మికుల‌కు పుట్టినిల్లు. ఇక్క‌డి నేత‌న్న‌ల చేతుల్లో ఎన్నెన్నో వినూత్న వ‌స్త్రాలు త‌యార‌వుతూ ఉంటాయి. ఇక ప‌ట్టుచీర‌ల విష‌యానికి వ‌స్తే... సిరిసిల్ల నేత‌న్న‌లు నేసే ప‌ట్టు చీర‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. వ‌స్త్రాలను నేసే ఇక్క‌డి నేత‌న్న‌లు నిత్యం ఏదో ఒక కొత్త త‌ర‌హా ప‌ద్ద‌తిని అవ‌లంబిస్తూ ఉంటారు. త‌మ వినూత్న రీతుల‌తోనే వార్త‌ల్లో వ్య‌క్తులుగా నిలుస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది. 

సిరిసిల్ల‌కు చెందిన చేనేత కార్మికుడు న‌ల్ల విజ‌య్ స‌రికొత్త ఆలోచ‌న చేశాడు. 27 సుగంధ ద్ర‌వ్యాల‌తో ఓ ప‌ట్టు చీర‌ను నేశాడు. ఇత‌ర‌త్రా ప‌ట్టుచీరల మాదిరే ఈ ప‌ట్టుచీరకు వినియోగించిన దారాల‌ను ఆయ‌న సుగంధ ద్ర‌వ్యాల‌తో కూడిన ద్రావ‌ణంలో ముంచి మ‌రీ చీర‌ను నేశాడు. వెర‌సి ఈ చీర‌ను అలా విప్ప‌గానే... సువాన‌స‌లు విర‌జిమ్ముతున్నాయి. ఈ చీర‌ను మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావులు శ‌నివారం ఆవిష్క‌రించారు. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌తో సాగుతున్న విజ‌య్‌ను మంత్రులు అభినందించారు.

More Telugu News