Infinix hot 20 5g: డ్యూయల్​ 5జీ, 50 ఎంపీ కెమెరాతో రూ.15 వేలకే ఇన్ఫినిక్స్​ హాట్​ 20 5జీ ఫోన్​.. ప్రత్యేకతలు ఇవిగో..

  • మీడియా టెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్ తో అందుబాటులోకి..
  • 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • రాత్రిపూట బాగా ఫొటోలు తీయగలిగేలా ‘సూపర్ నైట్ మోడ్’ సదుపాయం
Infinix hot 20 5g specifications and features

దేశంలో 5జీ సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఇన్ఫినిక్స్ సంస్థ బడ్జెట్ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెండు సిమ్ లు 5జీతో వాడుకునేందుకు వీలుగా, వేగంగా పనిచేసే ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్ ను సుమారు రూ.15 వేల ధరతోనే విక్రయించనున్నారు. ర్యామ్, మెమరీ సామర్థ్యం ఆధారంగా ధరల్లో మార్పు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ ప్రత్యేకతలు ఇవి..

  • 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. మంచి గేమింగ్, వ్యూయింగ్ అనుభూతి కోసం 120 నుంచి 240 హెర్ట్జ్ వరకు రీఫ్రెష్ రేటు ఉంటుంది. యూజర్లు కావాల్సిన రీఫ్రెష్ రేటును ఎంపిక చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
  • వేగంగా చార్జింగ్ అయ్యేందుకు వీలుగా 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. సాధారణ వాడకానికి మూడు రోజుల వరకు చార్జింగ్ వస్తుందని కంపెనీ పేర్కొంది.
  • ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమన్సిటీ 810 ఆక్టా కోర్ ప్రాసెసర్ ను అమర్చారు. 4 జీబీ ర్యామ్ నుంచి 12 జీబీ ర్యామ్ వరకు వివిధ వేరియంట్లలో లభిస్తుంది. 
  • ఆండ్రాయిడ్ 12 ఆధారంగా అభివృద్ధి చేసిన ఎక్స్ ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంను ఫోన్ లో లోడ్ చేశారు. రెండు సిమ్ స్లాట్లు కూడా 5జీని సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది.
  • వెనుకవైపు 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ తో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. రాత్రిపూట తక్కువ వెలుతురులోనూ ఫొటోలు బాగా తీయగలిగేందుకు తోడ్పడేలా సూపర్ నైట్ మోడ్ ను పొందుపర్చారు.
  • ముందువైపు వాటర్ డ్రాప్ స్టయిల్ లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
  • గేమ్స్ ఆడినప్పుడు ఫోన్ బాగా వేడెక్కకుండా ప్రత్యేకంగా ‘ఫేస్ చేంజ్ కూలింగ్ సిస్టం’ ఈ ఫోన్ లో ఉందని కంపెనీ పేర్కొంది.
  • వైఫై సరిగా లేకున్నా, చాలా బలహీనంగా ఉన్నా ఆటోమేటిగ్గా మొబైల్ డేటాకు మారిపోయేలా ‘లింక్ ప్లస్ 1.0’ ఫీచర్ ను అందిస్తున్నట్టు వెల్లడించింది.
  • ‘బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ’ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంది. అమెరికా మార్కెట్లో 4జీబీ ర్యామ్ 128 జీబీ మెమరీ మోడల్ ను 179.9 డాలర్లకు విక్రయిస్తున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.15 వేలు మాత్రమే.

More Telugu News