దూసుకుపోతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్!

  • విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా'
  • ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ 
  • దర్శకుడిగా అశ్వత్ మారిముత్తు 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
Ori Devuda Movie Update

మొదటి నుంచి కూడా విష్వక్సేన్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఓరి దేవుడా' రెడీ అవుతోంది. వెంకటేశ్ ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. 

తమిళ .. కన్నడ భాషల్లో రీమేక్ గా ఈ కథ అక్కడి ప్రేక్షకులను అలరించింది. దీపావళి కానుకగా ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టి, ట్రెండింగులో నెంబర్ వన్ గా నిలిచింది. 

జీవితంలో వరుస కష్టాలు ఎదురైనప్పుడు 'ఓరి దేవుడా' ఇవెక్కడి కష్టాలురా నాయనా అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక అవకాశాన్ని జారవిడుచుకున్నప్పుడు భగవంతుడు మరొక్క ఛాన్స్ ఇస్తే బాగుండునే అనుకోవడం జరుగుతుంది. ఈ రెండు అంశాల చుట్టూనే తిరిగే కథ ఇది. తెలుగులోను ఈ కథకి ఆదరణ లభిస్తుందేమో చూడాలి. 

More Telugu News