Russia: పుతిన్‌కు పుట్టినరోజు గిఫ్ట్‌గా ట్రాక్ట‌ర్‌ ఇచ్చిన బెలార‌స్ అధ్య‌క్షుడు

  • సెయింట్ పీట‌ర్స్ బ‌ర్గ్‌లో పుతిన్ బ‌ర్త్ డే వేడుల‌కు హాజ‌రైన అలెగ్జాండర్ లుకాషెంకో
  • నిరాడంబ‌రంగా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్న పుతిన్‌
  • త‌మ దేశంలో తయారు చేసిన ట్రాక్ట‌ర్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన లుకాషెంకో
Belarus leader gifts tractor on Russian presidents 70th birthday

యుద్దభూమిలో ఉక్రెయిన్ దీటైన ప్ర‌తిఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్ర‌వారం తన 70వ పుట్టినరోజును ఎలాంటి ఆడంబరం, హంగామా లేకుండా సాదాసీదాగా  జరుపుకున్నారు. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు, ఆ దేశంపై సైనిక చ‌ర్య‌పై  స్వ‌దేశంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న పుతిన్ కు ఉత్సాహం క‌లిగించేలా బెలార‌స్ అధ్యక్షుడు, సన్నిహిత మిత్రుడు అలెగ్జాండర్ లుకాషెంకో పుట్టినరోజు బహుమతిగా ట్రాక్టర్‌ను అందించారు. 

శుక్రవారం పుతిన్ సొంత న‌గ‌రం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటిన్ ప్యాలెస్‌లో ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బెలార‌స్‌లో తయారు చేసిన ట్రాక్టర్‌కు బహుమతి ధృవీకరణ పత్రాన్ని రష్యా అధ్యక్షుడికి లుకాషెంకో అందించారు. 1994 నుంచి బెలారస్‌ను ఉక్కు పిడికిలితో పాలించిన లుకాషెంకో, తన సొంత తోటలో అదే మోడల్ ట్రాక్టర్‌ను ఉపయోగించినట్టు విలేకరులతో అన్నారు.

ఆసక్తికరంగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యొక్క ప్రారంభ దశలో ట్రాక్టర్లు ఉక్రెయిన్ ప్రతిఘటనకు చిహ్నంగా ఉద్భవించాయి. అవి రష్యన్ ట్యాంకులను లాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బహుమతికి పుతిన్‌ తక్షణ స్పందన తెలియనప్పటికీ, ట్రాక్టర్ల‌తో ఆయ‌న‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అనేక సందర్భాల్లో వాటితో ఫోటో తీసుకున్నారు. 2018లో పుతిన్ రష్యాలోని రోస్టోవ్-ఆన్-డాన్‌లోని ఒక కర్మాగారంలో  ట్రాక్టర్‌లో ప్రయాణించారు. 2010లో టాంబోవ్‌లో ఒక ట్రాక్టర్ చక్రం ముందు ఫొటో దిగారు. 2005లో హనోవర్‌లో జరిగిన ఒక వాణిజ్య ప్రదర్శనలో అప్పటి జర్మన్ ఛాన్సలర్ గెర్హార్డ్ ష్రోడర్‌తో వ్యవసాయ ట్రాక్ట‌ర్ పై ఆనందంగా ప్రయాణించారు. 

ట్రాక్టర్‌తో పాటు, పుతిన్‌కు మిత్రదేశాలు, స్నేహపూర్వక రాష్ట్రాల అధినేతల నుండి విలాసవంతమైన బహుమతులు లభించాయి. తజకిస్థాన్ ప్రెసిడెంట్ ఎమోమాలి రెహ్మాన్.. పుతిన్ కు పుచ్చ‌కాయ‌ల‌ పిర‌మిడ్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

More Telugu News