విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం: రైల్వే శాఖ

  • విజయవాడ డివిజన్ లో పనులు జరుగుతున్నాయని ప్రచారం
  • రైళ్ల రద్దు, వేళల మార్పు, దారి మళ్లింపు అంటూ వార్తలు
  • స్పందించిన విజయవాడ రైల్వే పీఆర్ఓ
  • నిరాధారమైన వార్తలని స్పష్టీకరణ
  • డివిజన్ పనులేవీ జరగడంలేదని వెల్లడి
Railway dept says no train cancellation under Vijayawada division

విజయవాడ డివిజన్ లో పలు రైళ్లు రద్దయినట్టు, కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోందని, అందులో నిజం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీనిపై విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ స్పందించారు. 

విజయవాడ స్టేషన్ పరిధిలో జరుగుతున్న పనుల కారణంగా ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు అని, మరికొన్ని రైళ్ల షెడ్యూల్ లో మార్పు చేశారని, కొన్ని రైళ్లు దారి మళ్లిస్తున్నారని ప్రచారం జరుగుతోందని పీఆర్ఓ తెలిపారు. 

విజయవాడ స్టేషన్ పరిధిలో పనులేవీ జరగడంలేదని స్పష్టం చేశారు. ఒకవేళ రైల్వే శాఖ అలాంటి పనులను చేపడితే మీడియాకు సమాచారం అందిస్తామని వెల్లడించారు. అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.

More Telugu News