Chandrababu: విజయనగరంలో ఉన్న మహారాజా ఆసుపత్రి పేరు తొలగింపు మరో తుగ్లక్ చర్య: చంద్రబాబు

Chandrababu slams CM Jagan over name change of Vijayanagaram Maharaja Hospital
  • విజయనగరంలో మహారాజా జిల్లా ఆసుపత్రి
  • ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా పేరు మార్పు
  • స్పందించిన చంద్రబాబు
  • జగన్ వెనక్కి తగ్గాల్సిందేనని డిమాండ్
విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విజయనగరంలో ఉన్న మహారాజా ఆసుపత్రి పేరు తొలగింపు మరో తుగ్లక్ చర్య అని విమర్శించారు. 

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించిన ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైందని తెలిపారు. నాడు మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం చైర్మన్ పోస్టుల నుంచి అశోక్ గజపతిరాజు గారిని ఇలాగే తప్పించి కోర్టుతో చీవాట్లు తిన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. 

"అయినా మీ వైఖరిలో మార్పు రాలేదు... ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎం జగన్ వెనక్కి తగ్గాల్సిందే" అంటూ డిమాండ్ చేశారు.
.
Chandrababu
Maharaja Hospital
Vijayanagaram
Jagan
TDP
YSRCP

More Telugu News