Surekha Vani: నాకు సినిమా ఆఫర్లను ఇవ్వడం లేదు: సురేఖ వాణి

No one is giving offers to me says  Surekha Vani
  • ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించని సురేఖ
  • సినిమాలకు సురేఖ గుడ్ బై చెప్పిందంటూ ప్రచారం
  • సినిమాల్లో నటించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్న సురేఖ
టాలీవుడ్ లో అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించింది. అయితే, ఇటీవలి కాలంలో ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను ఆమె కొట్టి పడేసింది. 

మరోవైపు ఆమె ఇటీవలి కాలంలో సినిమాలలో కనిపించడం లేదు. సినిమాలకు సురేఖ గుడ్ బై చెప్పిందని అంటున్నారు. ఈ వార్తలపై సురేఖ స్పందిస్తూ... తాను సినిమాల్లో కనిపించకపోవడానికి గల కారణాన్ని వివరించింది. సినిమాలలో నటించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని... అయితే, తనకు ఎవరూ అవకాశాలను ఇవ్వడం లేదని చెప్పింది. 'స్వాతిముత్యం' సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు లక్ష్మణ్ కే కృష్ణకు ధన్యవాదాలు తెలిపింది. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సురేఖ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ హీరో, హీరోయిన్లుగా నటించారు.
Surekha Vani
Tollywood
Acting

More Telugu News