Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ సిద్ధం!... 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌!

ts bjp chief bandi sanjay releases incharges to 119 assembly constituencies
  • వ‌చ్చే డిసెంబ‌ర్‌లోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు
  • ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న అన్ని పార్టీలు
  • అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ
  • జాబితాను విడుద‌ల చేసిన బండి సంజ‌య్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. క్రితం సారి నిర్ణీత స‌మ‌యానికి 6 నెల‌లు ముందుగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగిన సంగతి తెలిసిందే. ఫ‌లితంగా ప్ర‌స్తుత స‌భ‌కు వచ్చే ఏడాది డిసెంబ‌ర్ నాటికే గ‌డువు ముగియ‌నుంది. ప్ర‌తి ఐదేళ్ల‌కోమారు ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్న నిబంధ‌న మేర‌కు వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్‌లోగానే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ మేర‌కు అధికార టీఆర్ఎస్‌తో పాటు విప‌క్షాలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 

రెండు వ‌రుస ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్ట‌రీతో రెట్టించిన ఉత్సాహంతో సాగుతున్న బీజేపీ ఈ ద‌ఫా తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు ద‌క్కేది త‌మ‌కేనన్న ధీమాతో ఉంది. అదే భావ‌న‌తో సాగుతున్న బీజేపీ రాష్ట్ర శాఖ శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీలను నియ‌మిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పూర్తి స్థాయి జాబితా విడుద‌ల చేశారు. 
Telangana
BJP
Bandi Sanjay
Telangana Assembly Election

More Telugu News