అయోధ్యలో రామాలయ నిర్మాణంపై యూపీ సీఎం కీలక ప్రకటన 

07-10-2022 Fri 12:54 | National
  • నిర్మాణ పనులు సగం పూర్తయినట్టు ప్రకటన
  • ఎన్నో చర్యల ఫలితమే ఇదన్న యూపీ సీఎం
  • 2024 మకర సంక్రాంతి రోజున ప్రతిష్టాపన
Ram temple construction work 50 percent complete UP CM Yogi Adityanath
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామాలయ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఆలయ నిర్మాణ పనులు సగం పూర్తయినట్టు తెలిపారు. 2024 మకర సంక్రాంతి రోజున రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించాలన్నది ఆలయ ట్రస్ట్ యోచన. 2020లో రామాలయ నిర్మాణం మొదలు కాగా, 2024లో పూర్తి కానుంది. జైపూర్ లో పంచఖండ్ పీఠం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడారు. 

1949లో రామమందిరం కోసం ఉద్యమం ఆరంభమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ చర్యల ఫలితమే ఆలయ నిర్మాణం సగం పూర్తి అయినట్టు చెప్పారు. ఇటీవలే కాలం చేసిన తన గురువు, మార్గదర్శి ఆచార్య ధర్మేంద్రకు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. రాముడు జన్మించిన చోటే ఆలయాన్ని నిర్మించాలన్నది ఆచార్య కలగా పేర్కొన్నారు.