ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. ఎక్కడికి వెళ్లి ఉంటారు?

07-10-2022 Fri 12:21 | Entertainment
  • రష్మిక నటించిన గుడ్ బై సినిమా విడుదల నేడే
  • విజయ్ తో కలసి మాల్దీవులకు రష్మిక వెళ్లి ఉండొచ్చన్న వార్తలు
  • వీరి మధ్య డేటింగ్ పై కొంత కాలంగా పుకార్లు
Rashmika Mandanna Vijay Deverakonda are spotted at Mumbai airport leave together for Maldives holiday
డేటింగ్ జంట, లవ్ బర్డ్స్ గా ప్రచారంలో ఉన్న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఒకే రోజు నిమిషాల వ్యవధిలో ముంబై ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట పడడం సందేహాలకు తావిచ్చింది. వీరిది హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఎన్నో కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో రష్మిక, విజయ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంత కాలంగా ప్రచారంలో ఉన్నాయి. 

తాము మంచి స్నేహితులమంటూ ఇద్దరూ లోగడ ప్రకటించారు. రష్మిక తన డార్లింగ్ అని, ఆమె అంటే ఎంతో అభిమానమని విజయ్.. కాఫీ విత్ కరణ్ జోహార్ లో ఒక ప్రశ్నకు బదులివ్వడం గమనార్హం. శుక్రవారం ఉదయం విజయ్ దేవరకొండ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. ఐదు నిమిషాల విరామంతో రష్మిక కూడా వచ్చింది. నవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్లిపోయింది. మేకప్ లేకుండా కనిపించింది. ఇద్దరూ గ్రే కలర్ టాప్ లో దర్శనమివ్వడం యాధృచ్చికమేమో.. ! రష్మిక నటించిన గుడ్ బై సినిమా నేడు విడుదల అయింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో కలిసి ఆమె మాల్దీవుల ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. (ఇన్ స్టాగ్రామ్ వీడియో కోసం)